Indian railways: నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు

కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌

Updated : 26 Jun 2022 07:43 IST

మరికొన్ని పాక్షికంగా.. 12 రైళ్ల దారిమళ్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (12758), కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ (17003), బల్లార్ష-సిర్పూర్‌టౌన్‌ (17004) రైళ్లను జూన్‌ 27 నుంచి జులై 20 వరకు 24 రోజులపాటు రద్దు చేశారు. హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17001), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-హైదరాబాద్‌ (17002) రైళ్లను జులై 10, 13, 20 తేదీల్లో రద్దు చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది.

పాక్షికంగా రద్దయిన రైళ్లు

భద్రాచలం రోడ్‌-బల్లార్ష (17003) రైలు జూన్‌ 27 నుంచి జులై 20 వరకు వరంగల్‌-బల్లార్ష మధ్య రద్దయ్యింది. సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌ (17034) జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ టౌన్‌-వరంగల్‌ మధ్య, సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233) జూన్‌ 26 నుంచి జులై 19 వరకు కాజీపేట-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (17234) జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-కాజీపేట మధ్య రద్దయ్యాయి.

దారి మళ్లించిన రైళ్లు

తిరుపతి-జమ్ముతావి (22705) రైలును జులై 5, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, ముద్కేడ్‌, పింపల్‌కుట్టి మీదుగా, సికింద్రాబాద్‌-దానాపూర్‌, దానాపూర్‌-సికింద్రాబాద్‌ (12791/12792) రైళ్లను జూన్‌ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. మరో తొమ్మిది రైళ్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని