Updated : 30 Apr 2022 07:24 IST

Andhra News: దూరంగా... ఎమ్మెల్యే పేర్ని నాని

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్‌ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్‌, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం మచిలీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి పేర్ని నాని దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి అప్పలరాజు చేయి పట్టుకుని అక్కడి పనులు పరిశీలించేందుకు రమ్మని తీసుకెళ్లినా ఆయన దూరంగానే ఉన్నారు. సముద్ర మొగ పరిశీలనకు ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఇతర ఉన్నతాధికారులు అందరూ పడవల్లో వెళ్లినా పేర్ని నాని మాత్రం ఒడ్డునే ఉండిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ తాను ఎప్పుడూ వెళ్లే ప్రదేశమే కదా అని వెళ్లలేదని స్పష్టం చేశారు.  కేంద్ర మంత్రి తెలుగు చక్కగా మాట్లాడతారని, నిగర్వి, చాలా సౌమ్యుడన్న విషయం ఆయనతో మాట్లాడిన తర్వాత తెలిసిందని పేర్కొన్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని