ఉద్యోగాల భర్తీ కోరుతూ త్వరలో సీఎం నివాసం ముట్టడి

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు యువతను మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపించారు. రాష్ట్ర

Published : 21 May 2022 05:59 IST

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు యువతను మోసం చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి త్వరలో తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ‘జాబ్‌ ఎక్కడ జగన్‌?’ అంశంపై ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు జిల్లాల తెలుగు యువత నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీరాం చినబాబు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కంపెనీలను వాటాలు అడగడం వల్లే అవి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని విమర్శించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా యువతకు ఎక్కడైనా ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పమిడి రమేష్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని