వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి

కాకినాడలో కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబసభ్యుల మీద వైకాపా గుండాలు, పోలీసులు

Published : 22 May 2022 05:49 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజటల్‌, అమరావతి : కాకినాడలో కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబసభ్యుల మీద వైకాపా గుండాలు, పోలీసులు దాడికి దిగడాన్ని శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసుల తీరును ప్రశ్నించినందుకు మృతుడి భార్యపైనా చేయిచేసుకోవడం దారుణం. సీఎం విహారయాత్రకు వెళుతూ..వైకాపా మూకలను ప్రజల మీదకి వదిలారు...’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

తాడేపల్లి పెద్దల ఆదేశాలతో ఎమ్మెల్సీని కాపాడే ప్రయత్నం: వంగలపూడి అనిత ధ్వజం

తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే పోలీసులు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ‘ఎస్సీ యువకుడు సుబ్రమణ్యాన్ని వైకాపా ఎమ్మెల్సీ హత్య చేస్తే... సుబ్రమణ్యం కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం మానసికంగా హత్య చేస్తోంది. శుక్రవారం హత్య జరిగితే శనివారం వరకు పోస్టుమార్టం ఎందుకు చేయలేదు? తాడేపల్లి పెద్దల మాట విని ఎస్సీ యువకుడి కుటుంబానికి అన్యాయం చేస్తే చరిత్ర క్షమించదు. అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని