30 ఏళ్లు అధికారమని చెప్పి.. అప్పుడే ఓటమి భయమా?

ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా నేతలకు సవాలు

Published : 10 Jun 2022 06:01 IST

ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలి: అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు రావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైకాపా నేతలకు సవాలు విసిరారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసన చూసి.. 30 ఏళ్లు పాలన తమదే అని గతంలో చెప్పిన జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘2 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని నింపడానికి లోకేశ్‌ జూమ్‌ సమావేశం ఏర్పాటుచేస్తే వైకాపా నేతలు ఆడ్డుపడ్డారు. నకిలీ ఐడీలతో పాల్గొనాల్సిన అవసరమేంటి? గత ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లలో అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేశారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని