Atchannaidu: మేకపాటి కుటుంబ అభ్యర్థి కాకుంటే ఆత్మకూరులో సత్తా చూపేవాళ్లం: అచ్చెన్న

ఆత్మకూరు ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో

Updated : 14 Jun 2022 08:17 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఆత్మకూరు ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉండగా మరణిస్తే.. ఆ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని తెదేపా పాటిస్తోందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబీకులు ఉప ఎన్నికల్లో నిలబడితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ అంశంపై తమ విధానమేంటో వైకాపా స్పష్టం చేయాలి. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి ఆత్మకూరు సీటు కేటాయిస్తే.. తెదేపా తప్పక పోటీలో నిలబడేది. మా సత్తా ఎంతో చూపేవాళ్లం. ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా వైకాపాను బంగాళాఖాతంలో విసిరేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా వాళ్లు అనవసర సవాళ్లు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని