‘అంబుడ్స్‌మన్‌’ నియామకం ఎప్పుడు?

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగుల హక్కుల రక్షణకు ‘అంబుడ్స్‌మన్‌’ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితులు 2లక్షల మంది వరకు ఉన్నారు. వ్యాధిగ్రస్థులు

Published : 19 Jun 2022 05:30 IST

ఎయిడ్స్‌ బాధితులకు అందని సేవలు

ఈనాడు-అమరావతి: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగుల హక్కుల రక్షణకు ‘అంబుడ్స్‌మన్‌’ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితులు 2లక్షల మంది వరకు ఉన్నారు. వ్యాధిగ్రస్థులు కొన్నిచోట్ల వివక్షకు గురవుతున్నారు. ఒక్కోసారి వైద్యులనుంచి సరైన చికిత్స లభించడం లేదు. రాష్ట్రంలో 52 వరకున్న ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా వీరికి ఉచితంగా మందులివ్వాలి. ఈ సేవలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ‘అంబుడ్స్‌మన్‌’ ద్వారా న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ‘ది హ్యూమన్‌ ఇమ్యూనో డెఫీషియన్సీ వైరస్‌ అండ్‌ అక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫీషియన్సీ సిండ్రోమ్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌)- 2017పేరుతో కేంద్రం తెచ్చిన చట్టం 2018 సెప్టెంబరు10 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా కర్ణాటక, రాజస్థాన్‌, చండీగఢ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మేఘాలయ, తదితర రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోనూ దీని ఏర్పాటుపై 2019లో చర్చించినప్పటికీ ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ పట్టించుకున్న దాఖలాలు లేవు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థుల పట్ల వివక్ష, ద్వేషభావన వ్యాపింపజేయడం లేదా హింసించడం, న్యాయప్రక్రియలో గోప్యతను ఉల్లంఘించడం, ఆవాసం లేదా అద్దె ప్రాంగణం ఇవ్వకపోవడం, ఇతర చోట్ల వివక్ష ఎదురైతే ‘అంబుడ్స్‌మన్‌’ ద్వారా బాధితులు న్యాయం పొందేందుకు వీలుంది. వివక్ష తీవ్రతనుబట్టి గరిష్ఠంగా రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘన కొనసాగిస్తే రోజుకు రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తి లేదా వైద్య నిపుణుల్లో ఒకరిని అంబుడ్స్‌మన్‌గా నియమించాలి. మరోవైపు హెచ్‌ఐవీ బాధితులకు అండగా నిలుస్తామంటున్న కొన్ని సంస్థల పనితీరు అధ్వానంగా ఉంది. అధికారుల ఉదాసీనతతో అవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని