Published : 28 Jun 2022 05:41 IST

మెదడు పనితీరును వేగంగా సమీక్షించే నవ సాంకేతికత

ఈనాడు, బెంగళూరు: మానవ మెదడులోని నరాల వ్యవస్థను క్షుణ్ణంగా సమీక్షించే జీపీయూ ఆధారిత మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ను బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌) రూపొందించింది. రెగ్యులరైజ్డ్‌, యాక్సిలరేటెడ్‌, లీనియర్‌ ఫేసికల్‌ ఎవాల్యుయేషన్‌ (రియల్‌ లైఫ్‌)గా పిలిచే ఈ అల్గారిథమ్‌ మానవ మెదడులో నిత్యం ఉత్పన్నమయ్యే విద్యుదీకరణ కదలికల డేటాను ప్రస్తుత విధానంతో పోలిస్తే 150 రెట్ల వేగంగా నమోదు చేయగలదు. ఈ డేటా నమోదుకు ప్రస్తుతం గంటల సమయం పడుతోంది. జీపీయూ ఆధారిత అల్గారిథమ్‌తో నిమిషాల్లోనే సమీక్షించవచ్చని ఐఐఎస్‌సీ సెంటర్‌ ఫర్‌ న్యూరోసైన్స్‌ (సీఎన్‌ఎస్‌) అసోసియేట్‌ ఆచార్య దేవరాజ్‌ శ్రీధరన్‌ తెలిపారు. మానవ మెదడు నరాల వ్యవస్థలోని ఆక్సాన్లు ఒకచోట నుంచి మరోచోటకు వడివడిగా సంచరించే వేగాన్ని బట్టి మెదడు పనితీరును నిర్ణయిస్తారు. వీటిని ప్రస్తుతం డిఫ్యూజన్‌ మ్యాగ్నటిక్‌ రిసొనెన్స్‌ ఇమేజింగ్‌ (డీఎంఆర్‌ఐ) స్కాన్‌ ద్వారా కంప్యూటరైజ్‌ చేసి వైద్య నివేదికలు రూపొందిస్తారు. స్కానర్ల నుంచి సీపీయూలోకి మార్చే సమయాన్ని ఈ అల్గారిథమ్‌ ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని సీఎన్‌ఎస్‌ పరిశోధక విద్యార్థి వర్ష శ్రీనివాసన్‌ తెలిపారు. ఈ అల్గారిథమ్‌ల తయారీ కోసం 200 మంది మెదళ్లను సమీక్షించామన్నారు. నీటి కణాలు ప్రసరించే ఫైబర్‌ గొట్టాలను మెదడు చుట్టూ కప్పి ఉంచి వాటి ద్వారా ‘కనెక్టమ్‌’ నెట్‌వర్క్‌ ఫైబర్‌ ట్రాక్‌లను సృష్టించారు. వీటి ద్వారా నమోదయ్యే కదలికలను గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అల్గారిథమ్‌ మ్యాప్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌లోనూ ఈ అల్గారిథమ్‌లను రీడిజైన్‌ చేస్తామన్నారు. బ్రెయిన్‌ ప్యాథాలజీ, మెదడు ఆరోగ్యాన్ని పరీక్షించే క్రమంలో ఈ అల్గారిథమ్‌ డేటా సైన్స్‌ ఉపయుక్తం కానుందని ఐఐఎస్‌సీ ప్రకటించింది.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని