మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ అమరావతిపై ఏదీ?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మద్యం ద్వారా ఆదాయం రాబట్టడంపై ఉన్న శ్రద్ధ అమరావతి నిర్మాణంపై లేదని రాజధాని రైతులు

Published : 30 Jun 2022 05:50 IST

రాజధాని రైతుల విమర్శ

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే - తుళ్లూరు గ్రామీణం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మద్యం ద్వారా ఆదాయం రాబట్టడంపై ఉన్న శ్రద్ధ అమరావతి నిర్మాణంపై లేదని రాజధాని రైతులు విమర్శించారు.  ఎన్నికల ముందు మద్యనిషేధం అని హామీ ఇచ్చిన సీఎం.. అధికారంలోకి వచ్చాక ఆదాయం కోసం దానిని తుంగలోకి తొక్కారని దుయ్యబట్టారు. అమరావతి విషయంలోనూ ఇదే విధంగా మాట తప్పారని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 925వ రోజుకు చేరుకుంది. మందడం, కృష్ణాయపాలెం, తాడికొండ, వెలగపూడి, దొండపాడు, నెక్కల్లు తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

రాజధాని భూములమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు: దేవినేని ఉమా
వెంకటపాలెం, తుళ్లూరు తదితర శిబిరాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రజల ఆస్తి అయిన అమరావతి భూములను అమ్మటానికి ప్రభుత్వానికి హక్కు లేదన్నారు. ఉద్యోగుల నివాసం కోసం కట్టిన భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇస్తే అది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైకాపా దుష్ట పాలన అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతికి మంచి రోజులు వస్తాయని రైతులకు ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని