Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

సినీనటుడు సోనూసూద్‌ పేరుతో ఓ మహిళ బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌లో చోరీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ

Updated : 01 Jul 2022 09:34 IST

ఖాతా నుంచి రూ.95 వేలు మాయం

రాజమహేంద్రవరం నేరవార్తలు: సినీనటుడు సోనూసూద్‌ పేరుతో ఓ మహిళ బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌లో చోరీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ మధుబాబు వివరాల మేరకు.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్‌ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి ఆరు నెలల బాబు ఉన్నాడు. చిన్నారికి దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. అంత ఆర్థిక స్థోమత లేని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని స్నేహితులు, బంధువులకు చేరవేశారు. జూన్‌ 27న సత్యశ్రీకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, సోనూసూద్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, ఆర్థికసాయం చేస్తామని నమ్మబలికాడు. వెంటనే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేస్తుండగా... అవేమీ తమకు అక్కర్లేదని, ఫోనులో ఎనీ డెస్కు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వివరాలు నమోదుచేయాలని సూచించాడు. ఆమె పూర్తి వివరాలు యాప్‌లో నమోదు చేశారు. తర్వాత ఆమెకు నగదు రాకపోగా... పలు దఫాలుగా సత్యశ్రీ బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు మాయమయ్యాయి. విషయం గుర్తించిన ఆమె గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని