Srilanka Crisis: అన్న రాజీనామా కోరిన తమ్ముడు?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న శ్రీలంకలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. తన అన్న, ప్రధానమంత్రి మహింద రాజపక్సతో రాజీనామా చేయించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు

Published : 28 Apr 2022 09:43 IST

ప్రధాని పదవిని వీడబోనన్న మహింద రాజపక్స

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న శ్రీలంకలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. తన అన్న, ప్రధానమంత్రి మహింద రాజపక్సతో రాజీనామా చేయించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తాను సిద్ధమని దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తెలిపినట్లు అక్కడి మీడియాలో తాజాగా వార్తలొచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని అన్ని పార్టీల నేతలకు గొటబాయ ఈ మేరకు లేఖ రాసినట్లు అవి పేర్కొన్నాయి. ఈ వార్తలను మహింద బుధవారం తోసిపుచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. పదవి నుంచి తప్పుకోవాలంటూ దేశాధ్యక్షుడు తనను కోరలేదనీ స్పష్టం చేశారు. అవసరమైతే తన నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకూ ఆస్కారమున్న సంగతిని గుర్తుచేశారు. గొటబాయతో తనకు విభేదాలేవీ లేవని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో దేశాధ్యక్షుడు శుక్రవారం భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని