చట్టసభలో నీలిచిత్రాల వీక్షణ.. ఎంపీ నీల్‌ పరీశ్‌ రాజీనామా

బ్రిటన్‌లో చట్టసభలోనే నీలి చిత్రాలను వీక్షించిన అధికార కన్జర్వేటివ్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఒకరు చివరకు పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడు నీల్‌ పరీశ్‌(65) పదవికి రాజీనామా చేశారు.

Published : 01 May 2022 10:09 IST

లండన్‌: బ్రిటన్‌లో చట్టసభలోనే నీలి చిత్రాలను వీక్షించిన అధికార కన్జర్వేటివ్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఒకరు చివరకు పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడు నీల్‌ పరీశ్‌(65) పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్‌లో మే అయిదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకే చెందిన నీల్‌ పరీశ్‌ వ్యవహారం కొత్త విమర్శలకు తావిచ్చినట్లైంది. మరోవైపు, కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకోవడంపై తీవ్ర విమర్శల పాలైన ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందిగా సొంత పార్టీ సభ్యుల నుంచి నీల్‌ పరీశ్‌పై ఒత్తిడి పెరిగింది. రాజీనామా అనంతరం నీల్‌ మాట్లాడుతూ.. వాస్తవానికి తాను ట్రాక్టర్ల వెబ్‌సైట్‌ చూసేందుకు యత్నించానని, అది పొరపాటున నీలిచిత్రాల వెబ్‌సైట్‌కు వెళ్లిందని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని