Super Scooter: భార్యకు ప్రేమతో.. ‘సూపర్‌ స్కూటర్‌’

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన మహ్మద్‌ అక్రమ్‌ గత 50 ఏళ్లుగా స్కూటర్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కానీ అతడి వద్ద చెడిపోయిన పాత స్కూటర్‌ ఉండేంది. దీనిపై ప్రయాణించాలంటేనే కష్టంగా ఉండేంది.

Updated : 03 May 2022 09:10 IST

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన మహ్మద్‌ అక్రమ్‌ గత 50 ఏళ్లుగా స్కూటర్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కానీ అతడి వద్ద చెడిపోయిన పాత స్కూటర్‌ ఉండేంది. దీనిపై ప్రయాణించాలంటేనే కష్టంగా ఉండేంది. దీంతో ఆగ్రహించిన అక్రమ్‌ భార్య.. ఈ చెడిపోయిన స్కూటర్‌పై కూర్చొనని శపథం చేసింది. ఆమె మాటలు విన్న అతడు స్కూటర్‌కు కొత్త రూపాన్ని ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించాడు. అనుకున్నదే ఆలస్యం పాత స్కూటర్‌ను మార్చే పనిలో నిమగ్నమయ్యాడు. స్కూటర్‌కు స్వయంగా పెయింట్‌ వేసి హెచ్‌డీ స్క్రీన్‌ను అమర్చాడు. కెమెరాలు, మ్యూజిక్‌ సిస్టమ్‌తో పాటు పూర్తిగా లైట్లతో అందంగా తయారు చేశాడు. ఆకర్షణీయంగా తయారైన ఈ వాహనాన్ని ‘సూపర్‌ స్కూటర్‌’గా పిలుస్తున్నారు.‘‘ పాత స్కూటర్‌పై రావడానికి నా భార్యకు ఇబ్బందిగా ఉండేది. దానిపై ప్రయాణించనని కోపం తెచ్చుకుంది. దీంతో స్కూటర్‌ను మార్చాలనే ఆలోచన వచ్చింది. దీంతో కారు మాదిరిగా స్క్రీన్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌, లైటింగ్‌ అమర్చాను. ప్రస్తుతం లీటర్‌కు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిపై జైపుర్‌, అజ్‌మేర్‌ వెళ్లి వచ్చాను. ఈ స్కూటర్‌ను తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది.  ఇప్పుడు నా భార్య చాలా సంతోషంగా ఉంది’’ అని అక్రమ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని