Marriage: 36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు..

బిహార్‌లోని భగల్‌పుర్‌లో అరుదైన వివాహం జరిగింది. నవ్‌గాచియాలోని గోపాల్‌పుర్‌ బ్లాక్‌లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు. వరుడి ఎత్తు 36 అంగుళాలు కాగా.. వధువు ఎత్తు 34 అంగుళాలు. వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Updated : 05 May 2022 10:51 IST

బిహార్‌లోని భగల్‌పుర్‌లో అరుదైన వివాహం జరిగింది. నవ్‌గాచియాలోని గోపాల్‌పుర్‌ బ్లాక్‌లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు. వరుడి ఎత్తు 36 అంగుళాలు కాగా.. వధువు ఎత్తు 34 అంగుళాలు. వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ అరుదైన వివాహాన్ని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ జంటతో సెల్ఫీలు దిగడానికి  పోటీపడ్డారు. ‘‘నేను డ్యాన్స్‌ పార్టీలో ఆర్టిస్ట్‌గా పనిచేస్తాను. ఈ వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. నా భార్యను సంతోషంగా చూసుకుంటా. మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రానివ్వను’’ అని వరుడు మున్నా భారతి తెలిపారు. ‘‘నేను సర్కస్‌లో పనిచేస్తాను. మున్నాను చూడగానే నా చెల్లెలికి అతడే కరెక్ట్‌ అని అనుకున్నాను. అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిద్దరికి వివాహం నిశ్చయించాను’’ అని వధువు సోదరుడు ఛోటూఛలియా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని