Xi Jinping: జిన్‌పింగ్‌ మెదడు రక్త నాళంలో బెలూన్‌!

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సెరెబ్రల్‌ అన్యూరిజమ్‌(మెదడులోని రక్తనాళంలో బెలూన్‌ ఏర్పడడం)తో బాధపడుతున్నారని, ఈ సమస్యతోనే 2021 డిసెంబరులో ఆసుపత్రిలో ఆయన చేరాల్సి వచ్చిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 11 May 2022 10:17 IST

సంప్రదాయ వైద్యానికే మొగ్గు చూపిన చైనా అధ్యక్షుడు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సెరెబ్రల్‌ అన్యూరిజమ్‌(మెదడులోని రక్తనాళంలో బెలూన్‌ ఏర్పడడం)తో బాధపడుతున్నారని, ఈ సమస్యతోనే 2021 డిసెంబరులో ఆసుపత్రిలో ఆయన చేరాల్సి వచ్చిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స చేయించుకోకుండా సంప్రదాయ చైనా వైద్యంలోనే చికిత్స పొందటానికి ఆయన మొగ్గు చూపుతున్నారని సమాచారం. 2019 చివరిలో చైనాలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యే వరకు విదేశీ నేతలు ఎవరినీ ఆయన కలవకపోవడానికి కారణం  అనారోగ్యమేనని భావిస్తున్నారు. 2019 మార్చిలో ఇటలీ, ఆ తర్వాత ఫ్రాన్స్‌ పర్యటన సమయంలోనూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని