Updated : 16 May 2022 09:25 IST

Crime News: ప్రాణం తీసిన రూ.30 వివాదం

బిజ్‌నోర్‌: అప్పు తీసుకున్న రూ.30 తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ముగ్గురు వ్యక్తులు ఓ కిరాణా దుకాణదారుని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని టండా ధాకి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. యశ్‌పాల్‌(50) కిరాణ కొట్టు నడుపుతున్నాడు. ఆయన వద్ద తీసుకున్న రూ.30 తిరిగి ఇవ్వాలని కోరడంతో భూపేంద్ర, ఆయన సోదరుడు యోగేంద్ర, ఆషి కలిసి యశ్‌పాల్‌పై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యశ్‌పాల్‌ ప్రాణాలు విడిచాడు. నిందితులపై కేసు నమోదు చేశామని.. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని