Biryani: బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..

బిర్యానీ కోసం రూ.3లక్షలు చెల్లించినట్లు నకిలీ బిల్లు పెట్టాడో కాంట్రాక్టర్‌. ఈ  ఘటన పశ్చిమబెంగాల్‌లోని కత్వా సబ్‌డివిజనల్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సౌవిక్‌ ఆలం ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చూసి షాకయ్యారు.

Updated : 16 May 2022 08:49 IST

పశ్చిమబెంగాల్‌లో ఓ కాంట్రాక్టర్‌ నిర్వాకం

బిర్యానీ కోసం రూ.3లక్షలు చెల్లించినట్లు నకిలీ బిల్లు పెట్టాడో కాంట్రాక్టర్‌. ఈ  ఘటన పశ్చిమబెంగాల్‌లోని కత్వా సబ్‌డివిజనల్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సౌవిక్‌ ఆలం ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చూసి షాకయ్యారు. బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్లు ఓ కాంట్రాక్టర్‌ బిల్లు దాఖలు చేశాడు. కింగ్‌షుక్‌ అనే కాంట్రాక్టర్‌ ఆస్పత్రికి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేస్తాడు. ఫర్నిచర్‌, ఫార్మసీ, కారు ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలిపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. సౌవిక్‌ వీటిని పరిశీలించగా.. 81 రకాల నకిలీ బిల్లులు కనిపించాయి. బిల్లుపై సంతకం చేసిన ప్రతి ఆరోగ్య కార్యకర్తను విచారిస్తామని.. దోషులుగా తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు