Putin: పుతిన్‌కు తీవ్ర అనారోగ్యం..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్‌ యుద్ధంతో ముడిపెడుతూ అమెరికాకు చెందిన ఒక మేగజీన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

Updated : 16 May 2022 11:21 IST

రక్త కేన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు
బ్రిటన్‌ మాజీ గూఢచారి వెల్లడి

లండన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్‌ యుద్ధంతో ముడిపెడుతూ అమెరికాకు చెందిన ఒక మేగజీన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే. రష్యా నుంచి, ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుతిన్‌ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు’ అని చెప్పారు. రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు కూడా పుతిన్‌ అనారోగ్యం గురించి ధ్రువీకరించారు. కేన్సర్‌ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది చోటు చేసుకుందని తెలిపారు. పుతిన్‌ ‘వెర్రి’ నిర్ణయంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ఆయనకు పుతిన్‌తో సన్నిహిత సంబంధం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని