గుజరాత్‌లో ఆకాశం నుంచి పడిన లోహపు బంతులు

ఇటీవల గుజరాత్‌ లోని కొన్ని గ్రామాల్లో ఆకాశం నుంచి నాలుగు గోళాకార లోహపు వస్తువులు ఊడిపడ్డాయి. ఒకటిన్నర అడుగుల వ్యాసంలో ఉన్న ఈ వస్తువులు ఈ నెల 12, 13 తేదీల్లో ఆనంద్‌

Updated : 18 May 2022 08:13 IST

పరిశోధన కోసం ఇస్రోకు పంపిన అధికారులు

అహ్మదాబాద్‌: ఇటీవల గుజరాత్‌ లోని కొన్ని గ్రామాల్లో ఆకాశం నుంచి నాలుగు గోళాకార లోహపు వస్తువులు ఊడిపడ్డాయి. ఒకటిన్నర అడుగుల వ్యాసంలో ఉన్న ఈ వస్తువులు ఈ నెల 12, 13 తేదీల్లో ఆనంద్‌ జిల్లాలోని దగ్జిపురా, ఖంభోలాజ్‌, రాంపుర్‌, ఖేడా జిల్లా భూమేల్‌ గ్రామాల్లో ఈ శకలాలు పడినట్లు ఆనంద్‌ జిల్లా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ బీడీ జడేజా చెప్పారు. వీటి వల్ల ఎవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. అదేవిధంగా వడోదర జిల్లాలోని సావ్లి గ్రామంలోనూ ఇలాంటి శకలాలే కనిపించాయని తెలిపారు. పరిశీలన నిమిత్తం వీటిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు, భౌతిక శాస్త్ర పరిశోధనశాలకు పంపినట్లు జడేజా తెలిపారు. మరో వైపు ఈ శకలాలు చైనాకు చెందిన ఛాంగ్‌ జెంగ్‌ 3బి రాకెట్‌ అంతర్భాగాలై ఉండవచ్చునని అమెరికన్‌ ఖగోళవేత్త జోనాథన్‌ మెక్‌ డొవెల్‌ ఈ నెల 12న ట్వీట్‌ చేశారు. రాకెట్‌ భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు అవి కింద పడి ఉండవచ్చునని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని