రష్యా సైనికుడి నేరాంగీకారం
నిరాయుధుడైన 62 ఏళ్ల ఉక్రెయిన్ పౌరుడిని తాను కాల్చి చంపినట్లు రష్యా సైనికుడు వాదిమ్ షిషిమారిన్ బుధవారం అంగీకరించారు. తమ దేశ దురాక్రమణకు దండెత్తిన రష్యా సేనలపై ఉక్రెయిన్లో యుద్ధనేరాల కింద విచారణ మొదలైన విషయం
నేడు కొనసాగనున్న విచారణ
కీవ్: నిరాయుధుడైన 62 ఏళ్ల ఉక్రెయిన్ పౌరుడిని తాను కాల్చి చంపినట్లు రష్యా సైనికుడు వాదిమ్ షిషిమారిన్ బుధవారం అంగీకరించారు. తమ దేశ దురాక్రమణకు దండెత్తిన రష్యా సేనలపై ఉక్రెయిన్లో యుద్ధనేరాల కింద విచారణ మొదలైన విషయం తెలిసిందే. తనపై మోపిన నేరాభియోగాలను అనువాదకుని ద్వారా తెలుసుకున్న వాదిమ్.. దానిపై మాట్లాడడానికి విముఖత వ్యక్తం చేశారు. పౌరుడి మృతికి పూర్తి బాధ్యత తనదేనన్నారు. కీవ్లోని న్యాయస్థానానికి మీడియా వెల్లువెత్తడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని రష్యా తెలిపింది. సైనికుడిపై మోపిన అభియోగాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, అవన్నీ కల్పితాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.