సీసీఐని అమ్మి ఏం సాధిస్తారు?

తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్‌ కర్మాగారాన్ని విక్రయించి భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి,

Published : 19 May 2022 05:21 IST

కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్‌ కర్మాగారాన్ని విక్రయించి భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. లక్షల మందికి జీవనాధారమైన సింగరేణి, ఆదిలాబాద్‌కు జీవనాడిగా ఉన్న సీసీఐ (సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)ని ప్రోత్సహించాల్సింది పోయి ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేయడం దారుణమని పేర్కొన్నారు. బుధవారం ఆమె తమ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్‌ కర్మాగారాన్ని విక్రయించగా వచ్చే డబ్బును ఈ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర భాజపా నాయకులకు ఉందా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న భాజపాను అడుగడుగునా నిలదీయాలని ఆమె సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని