పెదకొండూరులో కాకతీయుల నాటి దానశాసనం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి దాన శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. శాసనంలో 112 పంక్తులు

Published : 19 May 2022 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి దాన శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. శాసనంలో 112 పంక్తులు ఉన్నాయని, తెలుగు భాషలో ఉన్న ఈ శాసనం 13, 14 శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నామని బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఈ శాసనం కాకతీయుల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని వివరించింది. గ్రామంలో గుడి నిర్మించినప్పుడు ఊరుమ్మడిగా ప్రజలు తమ ఆదాయం నుంచి దేవాలయ నిర్వహణకు ఇవ్వాల్సిన పన్నుల వివరాలను శాసనం పేర్కొంది. ఇక్కడి  పురావస్తు సంపద, శిల్పాలు, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు శాతవాహనుల నుంచి కాకతీయుల పాలన వరకూ చారిత్రకంగా విలసిల్లిన గ్రామంగా అనిపిస్తోంది’ అని వివరించారు. క్షేత్ర పరిశీలనలో బృంద సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, మండల స్వామి పాల్గొన్నారని హరగోపాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని