Updated : 20 May 2022 05:39 IST

ఎవరెస్టుపై ఎత్తయిన వాతావారణ కేంద్రం

కాఠ్‌మాండూ: ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. ఎవరెస్టు శిఖరాగ్రానికి (8,848.86 మీటర్లు) కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్‌కు చెందిన జల, వాతావరణ విభాగం (డీహెచ్‌ఎం) తెలిపింది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని