Dream 11: డ్రీమ్‌ 11లో జాక్‌పాట్‌.. రాత్రికి రాత్రే రూ.2 కోట్లు!

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ ‘డ్రీమ్‌ 11’ జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుణ్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ని చేసింది. తాను ఎంపిక చేసుకున్న జట్టు మొదటి స్థానంలో నిలవడంతో అతడు ఏకంగా రూ.2 కోట్లు గెల్చుకున్నాడు. బిజ్‌బెహరా

Updated : 24 May 2022 07:11 IST

శ్రీనగర్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ ‘డ్రీమ్‌ 11’ జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుణ్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ని చేసింది. తాను ఎంపిక చేసుకున్న జట్టు మొదటి స్థానంలో నిలవడంతో అతడు ఏకంగా రూ.2 కోట్లు గెల్చుకున్నాడు. బిజ్‌బెహరా పట్టణానికి చెందిన వసీం రాజా రెండేళ్లుగా ‘డ్రీమ్‌ 11’లో క్రికెట్‌, హాకీ, ఫుట్‌బాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడా విభాగాల్లో బెట్టింగ్‌ పెడుతున్నాడు. శనివారం కూడా అదే తరహాలో బెట్టింగ్‌ పెట్టగా.. జాక్‌పాట్‌ తగిలింది. ‘‘శనివారం రాత్రి నిద్రలో ఉండగా నా స్నేహితుడు ఫోన్‌ చేశాడు. నేను ఎంచుకున్న జట్టు మొదటి స్థానంలో ఉందని చెప్పాడు. లేచి చూసేసరికి.. నేను రూ.2 కోట్లు గెల్చుకున్నట్లు ఉంది. అంతా కలలా అనిపిస్తోంది. మాది పేద కుటుంబం. ఈ డబ్బుతో మా పరిస్థితి మారుతుంది. మా అమ్మ 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఇక మెరుగైన చికిత్స చేయిస్తా’’ అని వసీం చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని