గంటన్నరపాటు గాల్లోనే జనం

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్‌వే ఎక్కిన భక్తులు.. దానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గాలిలోనే ఉండిపోయారు. మధ్యప్రదేశ్‌ మైహర్‌లోని

Updated : 24 May 2022 05:57 IST

 రోప్‌వేకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఘటన

భోపాల్‌: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దైవ దర్శనానికి వెళ్లేందుకు రోప్‌వే ఎక్కిన భక్తులు.. దానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గాలిలోనే ఉండిపోయారు. మధ్యప్రదేశ్‌ మైహర్‌లోని త్రికూట్‌ కొండపైకి వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది. తుపాను విధ్వంసానికి భారీ వృక్షాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. గంటన్నర తర్వాత సరఫరాను పునరుద్ధరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని