పాకిస్థాన్‌లో లీటరు పెట్రోల్‌ రూ.180

పాకిస్థాన్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలను అక్కడి ప్రభుత్వం అమాంతంగా పెంచివేసింది. లీటరుకు రూ.30 చొప్పున అదనంగా వడ్డించింది. గురువారం అర్థరాత్రి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో ఆ దేశంలో లీటర్‌ పెట్రోలు ధర

Published : 27 May 2022 05:56 IST

డీజిల్‌ రూ.174, కిరోసిన్‌ రూ.156
ఒక్క రోజేే రూ.30 పెరిగిన ధర

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలను అక్కడి ప్రభుత్వం అమాంతంగా పెంచివేసింది. లీటరుకు రూ.30 చొప్పున అదనంగా వడ్డించింది. గురువారం అర్థరాత్రి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో ఆ దేశంలో లీటర్‌ పెట్రోలు ధర రూ.179.85కి, డీజిల్‌ రూ.174.15కి, కిరోసిన్‌ 155.95కి చేరుకున్నాయి. పాక్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ ఇస్లామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ధరల పెంపు విషయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)తో చర్చలు విఫలమైన మరుసటి రోజే పెట్రో ఉత్పత్తుల ధరను పెంచుతూ పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని