అతివేగం.. మృత్యుపాశం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్‌) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.

Published : 28 May 2022 06:26 IST

రోడ్డు ప్రమాద మరణాలకిదే ముఖ్యకారణం
మోర్త్‌-2020 వార్షిక నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంది. కేంద్ర రవాణా, రహదారుల శాఖ(మోర్త్‌) గత బుధవారం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. 2020 సంవత్సరానికి సంబంధించిన జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఈ నివేదిక ప్రకారం మొత్తం 19,172 ప్రమాదాల్లో 6,882 మంది మృతిచెందగా.. 18,661 మంది క్షతగాత్రులయ్యారు.ఆ నివేదికలోని మరికొన్ని వివరాలు...

శిరస్త్రాణం లేకపోవడంతో..
ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన వారిలో 41.33 శాతం మంది శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే మరణించారు.

* ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్లు : 2004
* మృతిచెందిన పిలియన్‌ రైడర్లు(వెనక కూర్చున్నవారు) : 841
* క్షతగాత్రులైన డ్రైవర్లు : 3837
* గాయపడ్డ పిలియన్‌ రైడర్లు : 2489

మృత్యుమాసం.. డిసెంబరు
ఏడాది మొదటి రెండు.. చివరి రెండు నెలల్లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. డిసెంబరులో అత్యధిక ప్రమాదాలు, మరణాలు సంభవించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు