Mother and Son: 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకుమారులు

నేపాల్‌కు చెందిన ఓ యువకుడు దిల్లీలో తప్పిపోయి 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. ఈ మేరకు రవి అనే యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం నేపాల్‌ నుంచి దిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు

Published : 05 Jun 2022 08:23 IST

నేపాల్‌కు చెందిన ఓ యువకుడు దిల్లీలో తప్పిపోయి 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. ఈ మేరకు రవి అనే యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం నేపాల్‌ నుంచి దిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఆ తర్వాత వారు పని చేసే చోటు నుంచి రవి తప్పిపోయాడు. నోయిడా, దాద్రీ అటవీ ప్రాంతంలోని కోట్‌ గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. కోట్‌ గ్రామంలో ఉండే సంజయ్‌ అనే వ్యక్తి రవిని తన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. 22 ఏళ్ల పాటు వారితోనే ఉండిపోయాడు రవి. రెండున్నరేళ్ల క్రితం రవిని కొందరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌కు తీసుకెళ్లారు. దీంతో దాద్రీ కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో సంజయ్‌ ఫిర్యాదు చేశాడు. అనంతరం రవి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. రెండున్నరేళ్ల తర్వాత బాఘ్‌పత్‌లో గుర్తించారు. తిరిగి సంజయ్‌ కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలోనే బాఘ్‌పత్‌కు చెందిన కొందరు రవి గురించి నేపాల్‌ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. నోయిడాలోని కోట్‌ గ్రామంలో ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న నేపాల్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం రవిని అతడి కుటుంబసభ్యుల దగ్గరకు తీసుకెళ్లారు. 27 ఏళ్ల తర్వాత తన కుమారుడిని కలిసిన రవి తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులను కలిసిన ఆనందంతో రవి సైతం కంటతడి పెట్టుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని