Dogs Wedding: పెంపుడు శునకాల పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు

ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పుర్‌ జిల్లాలోని సుమెర్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వింత వివాహం జరిగింది. భరువా గ్రామానికి చెందిన ఇద్దరు సాధువులు తమ పెంపుడు శునకాలకు హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారు.

Updated : 07 Jun 2022 07:49 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పుర్‌ జిల్లాలోని సుమెర్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వింత వివాహం జరిగింది. భరువా గ్రామానికి చెందిన ఇద్దరు సాధువులు తమ పెంపుడు శునకాలకు హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారు. సౌంఖర్‌ అడవుల్లో మనసర్‌ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్‌ మహారాజ్‌కు ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్కకు వివాహం చేయాలని అనుకున్న ఆయన.. పరఛాచ్‌లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్‌ దాస్‌ పెంచుకునే ఆడ కుక్కతో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు జూన్‌ 5న మూహుర్తం పెట్టి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించారు. 500 మందితో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. పెళ్లి అనంతరం అతిథులకు అనేక రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని