ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ: ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి

ఇద్దరు యువతులను ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న అరుదైన సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 12 Jun 2022 07:45 IST

ఇద్దరు యువతులను ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న అరుదైన సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కేశ్‌కాల్‌ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్‌ సింగ్‌ సలామ్‌కు ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్‌ అనే యువతితో ముందుగా నిశ్చితార్థం అయింది. ఆ తర్వాత దుర్గేశ్వరి.. రంజన్‌ సింగ్‌ ఇంటికి వచ్చి ఉంటోంది. కొద్ది నెలల తర్వాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి గోటా అనే యువతిని రంజన్‌ ప్రేమించాడు. ఈ క్రమంలోనే సన్నో గర్భం దాల్చింది. ఆమె సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రంజన్‌ సింగ్‌ కుటుంబంతో మాట్లాడారు. గ్రామంలో పంచాయితీ సైతం నిర్వహించారు. ఇద్దరు యువతులు రంజన్‌ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. అందుకు పెద్దలు సైతం ఒప్పుకోవడంతో ఒకే వేదికపై ఈ నెల 8న రంజన్‌ సింగ్‌ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని