UP: ఒక్కటైన 12 వేల జంటలు.. వధువుల ఖాతాల్లోకి రూ.35 వేల చొప్పున జమ

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో శుక్రవారం రాష్ట్రంలోని 60 జిల్లాల్లో 12 వేల జంటలకు సామూహిక వివాహ కార్యక్రమాలు జరిగాయి. లఖ్‌నవూలో ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్‌ మాట్లాడుతూ.

Updated : 13 Jun 2022 08:15 IST

నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో శుక్రవారం రాష్ట్రంలోని 60 జిల్లాల్లో 12 వేల జంటలకు సామూహిక వివాహ కార్యక్రమాలు జరిగాయి. లఖ్‌నవూలో ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్‌ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు, వరకట్న మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. మతాలకు అతీతంగా జరిగిన ఈ పెళ్లిళ్లలో సర్కారు తరఫున వధువుల ఖాతాల్లో రూ.35 వేల చొప్పున జమ చేయడం విశేషం. రెండోవిడత సామూహిక వివాహ కార్యక్రమాలు జూన్‌ 17న ఉంటాయని అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని