Diabetes: మధుమేహ బాధితుల పాదాలకు సాంకేతిక రక్ష

మధుమేహ బాధితుల పాదాలను రక్షించేందుకు బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండ్రోక్రానాలజీ రీసెర్చ్‌(కేఐఈఆర్‌)

Updated : 14 Jun 2022 07:57 IST

ఈనాడు, బెంగళూరు: మధుమేహ బాధితుల పాదాలను రక్షించేందుకు బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండ్రోక్రానాలజీ రీసెర్చ్‌(కేఐఈఆర్‌) విభాగాలు సంయుక్తంగా ప్రత్యేక పాదరక్షలను రూపొందించాయి. 3-డీ ప్రింటెడ్‌ స్నాపింగ్‌ టెక్నాలజీతో రూపొందించిన ఈ పాదరక్షలు బాధితుల పాదాల్లో మానని గాయాలు మరింత ఇబ్బంది పెట్టకుండా ఉపశమనం కలిగిస్తాయని కేఐఈఆర్‌ పోడియాట్రి విభాగాధిపతి పవన్‌ బెలెహళ్లి సోమవారం ఇక్కడ వెల్లడించారు. డయాబెటిక్‌ పెరిఫెరల్‌ న్యూరోపతి వ్యాధిగ్రస్తులకు ఈ పాదరక్షలు బాగా ఉపయోగపడతాయన్నారు. 3-డీ స్నాపింగ్‌ పాదరక్షలు గాయాలున్న వారు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే నడిచేందుకు సహకరిస్తాయని ఐఐఎస్‌సీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ విద్యార్థి ప్రియభ్రత మహారాణ తెలిపారు. సమస్యలున్నవారే కాకుండా సాధారణ వ్యక్తులకూ ఇవి ఉపయోగపడతాయని ఐఐఎస్‌సీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని