అఫ్గాన్‌లో విలయం.. అంతులేని విషాదం!

అఫ్గానిస్థాన్‌లో వెయ్యి మందిని బలిగొన్న భూకంపం పెను విలయం సృష్టించింది. ఘోరకలికి సాక్షీభూతంగా మారిన పక్టికా, ఖోస్త్‌ ప్రావిన్సుల్లో వాతావరణం సునామీని తలపిస్తోంది. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో పరిస్థితి మరింత

Published : 24 Jun 2022 06:03 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో వెయ్యి మందిని బలిగొన్న భూకంపం పెను విలయం సృష్టించింది. ఘోరకలికి సాక్షీభూతంగా మారిన పక్టికా, ఖోస్త్‌ ప్రావిన్సుల్లో వాతావరణం సునామీని తలపిస్తోంది. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తాలిబన్ల పాలనలో పేదరికం తాండవిస్తున్న ఆ గ్రామాలు మూరుమూలన ఉండటం.. విద్యుత్తు, సమాచార వ్యవస్థలు కుప్పకూలడంతో సాయం అందించడానికి కూడా పరిస్థితి ప్రతికూలంగా మారింది. ఓవైపు ఖననం చేయాల్సిన మృతదేహాలు.. మరోవైపు ఎవరైనా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో చేతులతోనే శిథిలాల తొలగింపు.. కుప్పకూలిన ఇళ్లపైనే సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు.. ప్రావిన్సు గ్రామాల్లో గురువారం ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో.

భారత్‌ సాయం..

దిల్లీ: అఫ్గాన్‌లో భూకంప బాధితుల ఉపశమనం కోసం భారత్‌ గురువారం సామగ్రిని పంపించింది. కాబుల్‌ చేరిన తొలివిడత సాయాన్ని (కన్సైన్‌మెంట్‌) భారత బృందం అందజేసింది. అఫ్గాన్‌లో దౌత్య కార్యకలాపాలను భారత్‌ గురువారం పునరుద్ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని