హైదరాబాద్‌ మట్టిగాజులకు భౌగోళిక గుర్తింపునివ్వాలి

హైదరాబాద్‌ లాడ్‌బజార్‌లో తయారయ్యే మట్టిగాజులకు భౌగోళిక గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల నోడల్‌ అధికారిణి శ్రీహారెడ్డి, ఉప సంచాలకుడు సుదిన్‌పాల్‌, జీఐ ఏజెంటు సుభాజిత్‌ సాహాలు

Published : 24 Jun 2022 06:03 IST

 తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారుల దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లాడ్‌బజార్‌లో తయారయ్యే మట్టిగాజులకు భౌగోళిక గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల నోడల్‌ అధికారిణి శ్రీహారెడ్డి, ఉప సంచాలకుడు సుదిన్‌పాల్‌, జీఐ ఏజెంటు సుభాజిత్‌ సాహాలు ఈ మేరకు గురువారం చెన్నైలోని జీఐ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. 500 సంవత్సరాల చరిత్రగల గాజులకు ఎంతో విశిష్టత ఉంది. లక్క రెనిన్‌ను కొలిమిపై కరిగించి, వృత్తాకారంలో తయారుచేసి, వాటికి స్ఫటికాలు, పూసలు లేదా అద్దాలతో డిజైన్‌ చేస్తారు. పూర్తిగా చేతులతో రూపుదిద్దే ఈ గాజులు దేశ, విదేశాల్లో గుర్తింపు పొందాయి. లాడ్‌బజార్‌ గాజులు హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. త్వరలోనే జీఐ కార్యాలయ నిపుణుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి గాజులను పరిశీలిస్తుంది.

గుర్తింపు ఖాయం

- శ్రీహారెడ్డి, నోడల్‌ అధికారిణి

హైదరాబాద్‌ మట్టిగాజులకు భౌగోళిక గుర్తింపు రావడం ఖాయం. హస్తకళాకారుల ప్రతిభ ప్రపంచానికి తెలియడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి ప్రచారం, మార్కెటింగుకు, కష్టానికి తగ్గ ఫలితం రావడానికి  ఇది ఉపయుక్తమవుతుంది. ఈ ఉద్దేశంతోనే మంత్రి కేటీ రామారావు సూచన మేరకు జీఐ గుర్తింపునకు దరఖాస్తు చేశాం. దశలవారీ పరిశీలన అనంతరం ఆమోదం లభించే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని