అలాగైతే న్యాయ ప్రక్రియలో రాజీ పడినట్లే

క్రూరమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో దోషులకు మరణ శిక్ష ఖరారయ్యాక- దాన్నుంచి వారిని తప్పించడమే ఏకైక లక్ష్యంగా మార్గాలు అన్వేషిస్తే న్యాయ ప్రక్రియ నిష్పక్షపాత దృక్పథంలో రాజీ పడినట్లవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Published : 25 Jun 2022 05:51 IST

క్రూర నేరాల కేసుల్లో మరణశిక్ష తగ్గింపు ప్రయత్నాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: క్రూరమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో దోషులకు మరణ శిక్ష ఖరారయ్యాక- దాన్నుంచి వారిని తప్పించడమే ఏకైక లక్ష్యంగా మార్గాలు అన్వేషిస్తే న్యాయ ప్రక్రియ నిష్పక్షపాత దృక్పథంలో రాజీ పడినట్లవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాజస్థాన్‌లో శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఏడున్నరేళ్ల ఓ చిన్నారిపై 2013లో మనోజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తలను ఛిద్రం చేసి చంపేశాడు. ఈ కేసులో మనోజ్‌కు రాజస్థాన్‌ హైకోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. దాన్ని సవాలు చేస్తూ అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై విచారణ నిర్వహించిన జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం.. హైకోర్టు తీర్పును శుక్రవారం సమర్థించింది. క్రూర నేరాలకు సంబంధించిన కేసుల్లో ఒకవేళ ప్రత్యక్ష సాక్షులు లేకున్నా ఇతర సాక్ష్యాధారాలన్నింటినీ పక్కాగా పరిశీలించిన తర్వాతే కోర్టులు మరణ శిక్ష విధిస్తాయని పేర్కొంది. అలాంటి కేసుల్లోనూ ఏదో ఒక మార్గంలో ఆ శిక్షను తగ్గించాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని పిటిషన్లు వేస్తూ ఉండటం సరికాదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని