Published : 25 Jun 2022 05:51 IST

శివుడు చెప్పాడని రాష్ట్రపతి ఎన్నికలకు సై.. ఎడ్లబండిపై దిల్లీకి..

త్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వినోద్‌ యాదవ్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఎడ్లబండి మీద దిల్లీకి బయల్దేరారు. శివుని వేషధారణలో ఉన్న వ్యక్తిని వెంటబెట్టుకుని పయనమయ్యారు. గతంలోనూ వారణాసిలో ప్రధాని మోదీ, యూపీ రాష్ట్ర మంత్రి రవీంద్ర జైశ్వాల్‌పై పోటీ చేశానని వినోద్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది ఎన్నికల్లో పోటీచేసిన వినోద్‌ అన్నింట్లోనూ ఓటమిపాలయ్యారు. ‘‘శివుడు నాకు కలలోకి వచ్చి మోదీని ప్రధానిని చేసేందుకు గుజరాత్‌ నుంచి దిల్లీ పంపా. అలాగే నువ్వు కూడా యూపీ నుంచి దిల్లీ వెళ్లు. కచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తావని చెప్పాడు. చాలా రాష్ట్రాల ఎంపీల మద్దతు నాకు ఉంది. ఈ నెల 25 నామినేషన్‌ వేసిన తర్వాత ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లను కలిసి మద్దతు కోరతా’’ అని వినోద్‌ చెప్పారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని