నల్లమల.. అటవీ అందాలు భళా!

కాకుల దూరని కారడవి.. ఎటుచూసినా పచ్చదనం.. మధ్యలో కృష్ణమ్మ పరుగులు, పలు రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు.. జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. వర్షాకాలంలో పచ్చదనం

Published : 25 Jun 2022 05:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాకుల దూరని కారడవి.. ఎటుచూసినా పచ్చదనం.. మధ్యలో కృష్ణమ్మ పరుగులు, పలు రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు.. జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకుని పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతం వర్షాకాలంలో ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. తన కెమెరాలో బంధించిన చిత్రాలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. అడవుల్లో ఉన్న వృక్షాలు, జంతువుల్ని కాపాడేందుకు అటవీ అధికారులు కృషి చేస్తున్నారంటూ సంతోష్‌ అభినందించారు. నల్లమల వంటి అటవీ రేంజ్‌ తెలంగాణలో ఉన్నందుకు గర్వపడాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ విశేషాల్ని అటవీశాఖ శుక్రవారం మీడియాకు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని