యాంటీబాడీలను తట్టుకొంటున్న ఒమిక్రాన్‌ ఉపరకాలు

రెండు మోతాదుల టీకాలు లేదా, బూస్టర్‌ డోసు వల్ల కానీ, గతంలో కొవిడ్‌ వైరస్‌ సోకడం వల్ల కానీ మానవ శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల నుంచి ఒమిక్రాన్‌ వైరస్‌ కొత్త ఉప రకాలు

Published : 25 Jun 2022 05:51 IST

జెరూసలెం: రెండు మోతాదుల టీకాలు లేదా, బూస్టర్‌ డోసు వల్ల కానీ, గతంలో కొవిడ్‌ వైరస్‌ సోకడం వల్ల కానీ మానవ శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల నుంచి ఒమిక్రాన్‌ వైరస్‌ కొత్త ఉప రకాలు గణనీయంగా తప్పించుకొంటున్నట్లు ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైన ఇజ్రాయెలీ అధ్యయనం వెల్లడించింది. సార్స్‌ కోవ్‌ 2 ఒమిక్రాన్‌ బీఏ 1 వేరియంట్‌ నుంచి మూడు ఉపరకాలు ఉత్పన్నమైనట్లు ఇజ్రాయెలీ పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే రెండు డోసులు, ఒక బూస్టర్‌ డోసు చొప్పున కోవిడ్‌ టీకాలు వేసుకున్న 27 మందిలో, గతంలో కోవిడ్‌ 19 వచ్చి తగ్గిన మరో 27 మందిలో యాంటీబాడీలు ఈ ఉప రకాలకు ఎలా స్పందించాయో పరిశీలించారు. ఈ స్పందన మూడు రెట్ల నుంచి 20 రెట్ల వరకు తక్కువ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని