ఆకాశంలో ఒకేచోట ఐదు గ్రహాలు

ఆకాశంలో ఓ అద్భుతం! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు గ్రహాలను వీక్షించే అవకాశం ఔత్సాహికులకు కలిగింది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలు ఒకే చోట

Published : 25 Jun 2022 05:51 IST

వాషింగ్టన్‌: ఆకాశంలో ఓ అద్భుతం! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు గ్రహాలను వీక్షించే అవకాశం ఔత్సాహికులకు కలిగింది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలు ఒకే చోట గుమికూడినట్లుగా శుక్రవారం నుంచి దర్శనమిస్తున్నాయి. సోమవారం వరకూ దీన్ని వీక్షించొచ్చు. ఇలాంటి అద్భుతం 2040 వరకూ కనిపించదు. చివరిసారిగా 2004లో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. ఈ గ్రహాలన్నీ స్వీయ కక్ష్యల్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు అవన్నీ ఆకాశంలో ఒకేచోట ఉన్నట్లు కనిపించినప్పటికీ వాటి మధ్య వందల కోట్ల కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని