Published : 26 Jun 2022 05:59 IST

దేశంలో వలసల రేటు 28.9 శాతం

ఉపాధి, విద్య కోసం పరాయి ప్రాంతాలకు..

జిల్లాలు, రాష్ట్రాలు దాటుతున్న ప్రజలు

కేంద్ర గణాంకశాఖ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జీవనోపాధి, ఉన్నత విద్య తదితర కారణాలతో దేశంలో ప్రజలు సొంతూళ్లను విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. చేసేందుకు వ్యాపారం, మంచి అవకాశాలు లభిస్తే కుటుంబాలతో సహా ఇతర రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. పల్లెల నుంచి పట్టణాలకే కాదు... గ్రామీణ ప్రాంతాలకూ వలసలు ఉంటున్నాయి. దేశంలోని వలసల్లో దాదాపు 10.2 శాతం ఇలాంటివే. దేశవ్యాప్తంగా వలసలపై 2020 జులై నుంచి 2021 జూన్‌ వరకు కేంద్ర గణాంకశాఖ అధ్యయనం చేసింది. జాతీయస్థాయిలో వలసల రేటు 28.9 శాతంగా ఉందని ఇందులో వెల్లడైంది. కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక మార్చి 2020 నుంచి వలసల అంచనాలను నమోదు చేసింది. ప్రస్తుతమున్న ప్రాంతం... గతంలో నివసించిన ప్రాంతం... ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? తదితర వివరాలతో సర్వే నిర్వహించి ఇటీవల నివేదిక విడుదల చేసింది.

వలసల తీరు ఇలా...

* మెరుగైన ఉద్యోగం, ఉపాధి కోసం 42.9 శాతం మంది పురుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారు.

* కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో 6.7 శాతం మంది వలస వెళ్లారు.

* మహిళల్లో 86.8 శాతం మంది వివాహాల కారణంగా పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లడంతో వలస కిందకు వస్తున్నారు.

* డకుటుంబ ఆర్థిక సమస్యలు, మెరుగైన ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మహిళల సంఖ్య స్వల్పంగా 0.15 శాతంగా నమోదైంది.

* గ్రామాల నుంచి గ్రామాలకు పురుషుల వలస 46.4 శాతంగా ఉంటే పట్టణాల నుంచి 53.6 శాతం. మహిళల వలసలు గ్రామాల నుంచి 89 శాతం, పట్టణాల నుంచి 11 శాతంగా ఉన్నాయి.

* గ్రామాల నుంచి పట్టణాలకు పురుషుల వలస 54.8 శాతం, పట్టణాల నుంచి 42.2 శాతం. మహిళల వలసలు గ్రామాల నుంచి 54.3 శాతం, పట్టణాల నుంచి 45.7 శాతంగా ఉన్నాయి.

* మార్చి 2020 తరువాత.. గ్రామీణ ప్రాంతాల నుంచి 47.1 శాతం, పట్టణాల నుంచి 50.9 శాతం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సొంత రాష్ట్రాల పరిధిలోనే వలస వెళ్లినవారు 63.1 శాతం మంది ఉంటే... ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు 34.9 శాతం మంది.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని