బంగ్లాలో అతి పొడవైన రోడ్డు-రైలు వంతెన ప్రారంభం

బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని షేక్‌ హసీనా శనివారం ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ.ల పొడవునా ఈ రోడ్‌-రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్‌తో రాజధాని ఢాకా,

Published : 26 Jun 2022 05:59 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని షేక్‌ హసీనా శనివారం ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ.ల పొడవునా ఈ రోడ్‌-రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్‌తో రాజధాని ఢాకా, ఇతర ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. పూర్తిగా బంగ్లాదేశ్‌ సొంత నిధులతో నిర్మించిన ఈ వంతెన దేశానికి గర్వకారణమని హసీనా కొనియాడారు. వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలిపారు. ‘‘ఈ వంతెన మన శక్తి సామర్థ్యాలకు ప్రతీక. ఇది దేశ ప్రజలందరిదీ’’ అని పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా దీన్ని నిర్మించగలిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వంతెన విశిష్టతలను ఆమె వివరించారు. తొలుత ఈ వంతెన నిర్మాణానికి ప్రపంచబ్యాంకు కన్సార్షియం నిధులందిస్తుందని ఆశించారు. అయితే 2012లో ఈ ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసింది. బంగ్లాదేశ్‌ అధికారుల్లో ఉన్నతస్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని అప్పట్లో పేర్కొంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బంగ్లాదేశ్‌ ఇక అంతర్జాతీయ సంస్థలను ఆశ్రయించరాదని నిర్ణయించి సొంత నిధులతోనే నిర్మాణం చేపట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును పూర్తిచేసినందుకు గాను బంగ్లా ప్రభుత్వానికి భారత్‌ అభినందనలు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని