Published : 26 Jun 2022 05:59 IST

పర్యావరణహిత ప్లాస్టిక్‌ సంచి @ రూ.2

కాలుష్య భూతాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా మైసూర్‌లోని డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (డిఎప్‌ఆర్‌ఎల్‌) పర్యావరణ హిత ప్లాస్టిక్‌ సంచులను తయారు చేసింది. ఈ సంచులు 180 రోజుల్లోనే భూమిలో కలిసిపోతాయని పరిశోధకులు తెలిపారు. ఈ సంచిలో 5కిలోల బరువున్న వస్తువులను తీసుకెళ్లవచ్చని వెల్లడించారు. ఈ సంచులను సహజంగా లభించే పాలీ లాక్టిక్‌ యాసిడ్‌ పాలీపెట్‌ నుంచి తయారు చేశారు. అదే సాంకేతికతతో భోజనం కంచాలు, చెంచాలు, ఆహార వినియోగానికి వాడే ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ సంచుల తయారీకి డా.ఝాన్సీ పాల్‌, డా.పాల్‌ మురగన్‌ ఆధ్వర్యంలో 15మంది శాస్త్రవేత్తల బృందం 5 ఏళ్లు కష్టపడింది. సాధారణంగా వస్త్రంతో తయారు చేసే సంచి ధర రూ.10 నుంచి రూ.15 ఉంటుంది. డీఎఫ్‌ఆర్‌ఎల్‌ తయారు చేసిన పర్యావరణహిత ప్లాస్టిక్‌ సంచి ధర కేవలం రూ.2 అని పరిశోధకులు తెలిపారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts