ప్లాస్టిక్‌ వ్యర్థాలపై ప్రత్యేక కార్యాచరణ

రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ భూతం బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటి నిర్వహణ కరవవుతుండటంతో కాలుష్యం పెరిగి భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్రప్రభావంపడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 27 Jun 2022 05:48 IST

ఎన్జీటీకి నివేదించిన రాష్ట్ర పురపాలక శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ భూతం బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటి నిర్వహణ కరవవుతుండటంతో కాలుష్యం పెరిగి భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్రప్రభావంపడే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కు నివేదించింది. వాటి నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పురపాలకశాఖ వివరించింది. రాష్ట్రంలో నిత్యం సుమారు 587 టన్నుల ప్లాస్టిక్‌ తయారవుతోంది. ప్రతిరోజు 1082 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగునపడుతుండగా.. అందులో సుమారు 334 టన్నులకు ఎలాంటి నిర్వహణ ఉండటం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. తాజాగా జులై 1 నుంచి నుంచి 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ తయారీ, వినియోగంపై నిషేధం అమలుకానుంది.

ఇదీ ప్రణాళిక..

* పురపాలక సంఘాల్లో, గ్రామపంచాయతీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేయడం

* నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం

* ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం.. వాటి ప్రత్యామ్నాయాలపై వివరించడం

* ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చకుండా చర్యలు

* నిర్వహణకు డంపింగ్‌ యార్డులో ప్రత్యేక ఏర్పాట్లు

* రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

* పురపాలక సంఘాల్లోనూ ప్రత్యేక కమిటీ

* ప్రజా ఫిర్యాదుల స్వీకరణ.. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని