Updated : 27 Jun 2022 07:51 IST

Telangana News: సరెండర్‌లీవ్‌ డబ్బు కోసం ఎదురుచూపులు

సుమారు 30 వేల మంది పోలీసుల నిరీక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌శాఖలో గతంలో లేనివిధంగా సరెండర్‌లీవ్‌ల వ్యవహారం కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే దాదాపు 30వేల మంది పోలీస్‌లకు ఒక్కొక్కరికి సుమారు రూ.లక్ష వరకు సొమ్ము అందాల్సి ఉంది. మరోవైపు ఈ డబ్బులు అందడంలో జాప్యం నెలకొనడంపై నారాయణపేట జిల్లాలో ఇటీవల ఇద్దరు పోలీసులు ఫోన్‌లో మాట్లాడుకున్నందుకు వారిపై వేటు పడటం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. పాఠశాలల పునఃప్రారంభ నేపథ్యంలో సరెండర్‌లీవ్‌ల సొమ్ము కోసం కొందరు పోలీసులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఏటా జనవరి, జులై, నవంబరులలో మూడు విడతలుగా ఈ డబ్బులు ఇస్తుంటారు. ఒక్కో సరెండర్‌ లీవ్‌ ద్వారా వేతనంలో సగం సొమ్ము అందుతుంది. కానిస్టేబుల్‌ మొదలుకొని ఇన్‌స్పెక్టర్ల వరకు ఈ సదుపాయముంది. మిగతా శాఖలతో పోల్చితేే పోలీస్‌శాఖలో సెలవులు అరుదుగా ఉంటాయి కాబట్టి సరెండర్‌ లీవుల ద్వారా సొమ్ము ఎక్కువగానే వస్తుంది. ఇప్పటివరకు ఎన్నడూ ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈసారి అందుకు భిన్నంగా గత నవంబరు, జనవరికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ అందలేదు. మరో వారం రోజుల్లో జులైకి సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరికి సుమారు 45 రోజుల వేతన సొమ్ము అందాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే విషయమై పోలీస్‌ అధికారుల సంఘం ప్రతినిధులు ఇటీవల డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని