- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
చర్చలకు సై అంటూనే ఇరాన్ రాకెట్ ప్రయోగం
టెహ్రాన్: అణు ఒప్పందంపై నిలిచిపోయిన చర్చలు తిరిగి ప్రారంభించాలని ఐరోపా సమాఖ్యతో అంగీకారం కుదిరిన మరుసటి రోజే ఇరాన్ ఘన ఇంధన రాకెట్‌ను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ టెలివిజన్ ప్రకటించింది. దీన్ని ప్రయోగించారా లేదా.. అన్న విషయమింకా నిర్ధారణ కాలేదు. అయితే కొన్ని రోజుల క్రితమే ప్రయోగ సన్నద్ధతకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ కొత్త రాకెట్‌కు 220 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్లే సామర్థ్యం ఉందని ఇరాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి అహ్మద్ హుస్సేనీ తెలిపారు. ఇది నిర్ధారిత కక్ష్యలోకి చేరిందా లేదా అన్నదింకా స్పష్టం కాలేదు. రాకెట్ ప్రయోగంపై అమెరికా మండిపడింది. ఇది చర్చల కొనసాగింపునకు ఏ రకంగానూ ఉపయోగపడదని, పరిస్థితిని మరింత జఠిలం చేస్తుందని పేర్కొంది. 2018లో ట్రంప్ హయాంలో ఇరాన్‌తో అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంది. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పంద పునరుద్ధరణకు చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యలో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
భాజపా కుట్రలో పావులౌతున్నారు.. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్
-
General News
Top ten news 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 న్యూస్
-
India News
YouTube Channels: నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం వేటు
-
World News
Monkeypox: మంకీపాక్స్ టీకాలు 100 శాతం పనిచేయవు..!
-
India News
నీతీశ్ ఆ పనిచేస్తే.. బిహార్‌లో ప్రచారాన్ని ఆపేస్తా: పీకే కీలక వ్యాఖ్యలు
-
Movies News
Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?