- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
సరబ్జీత్ సోదరి దల్బీర్ కన్నుమూత
అమృత్సర్: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ, తోటి ఖైదీల దాడిలో మరణించిన సరబ్జీత్ సింగ్ సోదరి దల్బీర్‌కౌర్ (67) ఆదివారం కన్నుమూశారు. తన సోదరుడిని నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె 22 ఏళ్ల పాటు పోరాటం చేశారు. దల్బీర్‌కౌర్ పంజాబ్ అమృత్‌సర్‌లో తుదిశ్వాస విడిచారు. ఛాతీలో నొప్పిగా ఉందని శనివారం రాత్రి చెప్పడంతో కుటుంబసభ్యులు ఆమెను అమృత్సర్ తీసుకొచ్చారు. అక్కడ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్ సైతం వెళ్లివచ్చారు. సరబ్జీత్ సింగ్, దల్బీర్‌కౌర్ జీవితాల ఆధారంగా బాలీవుడ్లో బయోపిక్ సైతం రూపొందింది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్ బచ్చన్ దల్బీర్ పాత్రలో నటించిన ‘సరబ్జీత్’ చిత్రం 2016లో విడుదలైంది. సరబ్జీత్ సింగ్ భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని భిఖివిండ్ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. ఆయనకు మరణశిక్ష విధించింది. అనంతరం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. 2013లో తోటి ఖైదీలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సరబ్‌జీత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అప్పటికి ఆయన వయసు 49 సంవత్సరాలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!