ఖతర్‌ నుంచి వచ్చి బాలికను అపహరించే యత్నం

ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన ఓ బాలికను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖతర్‌ నుంచి వచ్చిన నిందితుడు 13 ఏళ్ల బాలికను మభ్యపెట్టి నేపాల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, మధ్యలోనే పోలీసులు అతడిని

Published : 27 Jun 2022 05:53 IST

 నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు

ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన ఓ బాలికను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖతర్‌ నుంచి వచ్చిన నిందితుడు 13 ఏళ్ల బాలికను మభ్యపెట్టి నేపాల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, మధ్యలోనే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఈ మేరకు ఖతర్‌కు చెందిన నదాఫ్‌ మన్సూరీ(25)కి, బాలికకు ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులుగా మారారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఉండే బాలికను చూసేందుకు నదాఫ్‌.. ఖతర్‌ నుంచి వచ్చాడు. అనంతరం జూన్‌ 18న బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి రైల్వేస్టేషన్‌కు రావాలని డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత నేపాల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ లోగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నదాఫ్‌ను బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని