Published : 28 Jun 2022 05:54 IST

క్షుద్రపూజల పేరుతో మహిళ హత్య..

పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం

మానవత్వం మంటగలిసే హృదయవిదారక ఘటన ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాలో చోటుచేసుకుంది. క్షుద్రపూజల పేరుతో ఓ మహిళ సొంత సోదరినే హత్య చేసింది. నగర్‌ ఉంటరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దలేలి గ్రామంలో లలితాదేవి తన భర్త దినేశ్‌ ఓరన్‌తో కలిసి జీవిస్తోంది. వీరిద్దరు కలిసి ఓరన్‌ తోలాలోని రాంశరన్‌ నివాసానికి క్షుద్రపూజలు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన లలితాదేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది. గుడియాదేవి వచ్చిన వెంటనే లలితాదేవి మంత్రాలు చదవడం ప్రారంభించగా.. ఆమె భర్త గుడియాను కర్రతో కొట్టాడు. రక్తస్రావమై పడిపోయిన ఆమెను.. లలిత, ఆమె భర్త కలిసి ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం ఆమె నాలుకను కత్తిరించారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్‌ భాగాలలో చేతులు పెట్టి పేగులను బయటకు తీశారు. ఇంత దారుణానికి పాల్పడుతున్నా అక్కడే ఉన్న గుడియా భర్త సహా బంధువులంతా ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఆమె మృతదేహాన్ని అడవి మధ్యలోకి తీసుకెళ్లి దహనం చేశారు. గుడియా భర్త మున్నా.. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దీంతో పంచాయితీ పెట్టగా.. వార్డు కౌన్సిలర్‌ భర్త దీనిని కప్పిపుచ్చేందుకు యత్నించాడు. ఆ తర్వాత విషయం బయటకు రావడంతో పోలీసులకు సమాచారం అందింది. మరోవైపు, మున్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దినేశ్‌ ఓరన్‌, రాంశరన్‌ ఓరన్‌, లలితాదేవి సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని