Srilanka Crisis: లంకలో అందరికీ వర్క్‌ ఫ్రం హోం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను చమురు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే స్తోమత లేక వినియోగాన్ని భారీగా తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వచ్చే

Updated : 28 Jun 2022 07:58 IST

ఇంధన వినియోగం తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయం

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను చమురు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే స్తోమత లేక వినియోగాన్ని భారీగా తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు వరకు అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తాయని, మిగిలిన అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీ) అత్యవసర సర్వీసులకు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తుందని తెలిపింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఆరోగ్య సేవలు, ఆహార సరఫరా, వ్యవసాయం వంటివి అత్యవసర సేవల్లో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి బండులా గుణవర్ధనేని ఉటంకిస్తూ న్యూస్‌ఫస్ట్‌.ఎల్‌కే వెబ్‌పోర్టల్‌ వెల్లడించింది. ‘‘మిగిలిన అన్ని రంగాలు కచ్చితంగా ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధమవ్వాలి’’ అని మంత్రి స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని కనీసస్థాయికి తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని