జాకియా జాఫ్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ తీవ్ర నిరాశ

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్‌ దివంగత నేత ఎహ్‌సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశ

Published : 28 Jun 2022 05:54 IST

దిల్లీ, అహ్మదాబాద్‌: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్‌ దివంగత నేత ఎహ్‌సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని ఆ పార్టీ పేర్కొంది. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్‌ తన స్పందనను తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం తీర్పు తర్వాత కూడా పలు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని అందులో పేర్కొంది. ‘‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత హింస చోటుచేసుకున్నప్పుడు సీఎం, కేబినెట్‌ బాధ్యత వహించరా? నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ.. మోదీకి ఎందుకు రాజధర్మాన్ని బోధించాల్సి వచ్చింది? నాడు రాష్ట్ర ప్రభుత్వం అభినవ నీరోలా వ్యవహరించిందంటూ ఆక్షేపించింది ఇదే సుప్రీంకోర్టు కాదా? నాడు భాజపాకే చెందిన కొందరు నేతలు మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని ఎందుకు డిమాండ్‌ చేశారు? సిట్‌ నివేదికను ఆధారంగా చేసుకునే ఈ కేసులో పలువురిపై నేరనిరూపణ జరిగింది. అవి కూడా చెల్లవని భాజపా వాదిస్తుందా?’’ అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని